🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 26 August 2026, 7:04 pm Posted by : ARYADVI NEWS

అమ్మాయిలకు అదిరిపోయే స్కాలర్‌షిప్.. ఏటా రూ.1.50 లక్షల సాయం.. అక్టోబర్ 15 చివరి తేదీ!

News Image

ఇంటర్‌లో 75% మార్కులు.. కుటుంబ ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉంటే చాన్స్

ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతిలో మంచి మార్కులు సాధించి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు Kotak Education Foundation అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌–2026 కోసం అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ఎంపికైన విద్యార్థినులకు కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఖర్చులు, ల్యాప్‌టాప్‌, పుస్తకాలు, స్టేషనరీ, ఇంటర్నెట్‌, రవాణా వంటి అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.

🎓 అర్హతలు

ఇంటర్‌ లేదా 12వ తరగతిలో కనీసం 75% మార్కులు లేదా సమానమైన CGPA ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు.

ఇంజినీరింగ్‌, MBBS, BDS, లా, ఫార్మసీ, నర్సింగ్‌, డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశం పొంది ఉండాలి.

గుర్తింపు పొందిన ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులు అర్హులు.

📄 కావాల్సిన డాక్యుమెంట్లు

12వ తరగతి మార్కుల మెమో

ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా ITR

ఫీజు స్ట్రక్చర్‌ / అడ్మిషన్‌ ఆఫర్‌ లెటర్

కాలేజీ బోనఫైడ్‌ సర్టిఫికెట్

ఆధార్‌ కార్డు

బ్యాంక్‌ పాస్‌బుక్

పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో

💰 స్కాలర్‌షిప్‌ ఎంత?

ఏటా రూ.1,50,000 వరకు సాయం అందుతుంది. విద్యార్థిని కోర్సు పూర్తయ్యే వరకు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రతి ఏడాది రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఏడాది కనీసం 6 CGPA సాధించాలి లేదా తదుపరి సంవత్సరానికి ప్రమోషన్‌ పొందే అర్హత ఉండాలి.

📝 ఎంపిక విధానం

అప్లికేషన్ల పరిశీలన → షార్ట్‌లిస్టింగ్‌ → నేపథ్య పరిశీలన → వ్యక్తిగత ఇంటర్వ్యూ → తుది ఎంపిక.

📅 ముఖ్యమైన తేదీ

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 అక్టోబర్‌ 15

అర్హత ఉన్న విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

🏠 Home