🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 31 August 2026, 7:24 pm Posted by : ARYADVI NEWS

2027 వన్డే ప్రపంచకప్‌కు తిలక్‌ వర్మను సిద్ధం చేస్తున్న టీమిండియా.. శ్రేయస్‌ అయ్యర్‌కు పెరిగిన పోటీ!

News Image

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి సారించింది. నంబర్‌-4 స్థానంలో కీలకంగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కొత్త కాంబినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై శ్రేయస్‌ అయ్యర్‌ ప్రదర్శనతో పాటు అతడి ఫిట్‌నెస్‌, ఫీల్డింగ్‌ సామర్థ్యాలను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టాప్‌-6లో లెఫ్ట్‌హ్యాండర్‌ లేకపోవడం తిలక్‌ వర్మకు అదనపు ప్రయోజనంగా మారింది.

హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి గాయాల నేపథ్యంలో తిలక్‌ తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ను కూడా మెరుగుపరుచుకోవాలని మేనేజ్‌మెంట్‌ సూచించినట్లు సమాచారం. తిలక్‌ ఇప్పటికే భారత్‌ తరఫున 59 టీ20లు, 5 వన్డేలు ఆడాడు. దేశవాళీ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 52 మ్యాచ్‌ల్లో 2,142 పరుగులు చేసి, 6 సెంచరీలతో 47.60 సగటు నమోదు చేశాడు.

అక్టోబర్‌లో జరిగే న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ నుంచే 2027 ప్రపంచకప్‌ ప్రణాళికలను అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానానికి తిలక్‌ వర్మ నుంచి పోటీ పెరగనుంది.

🏠 Home