🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 01 September 2026, 5:53 pm Posted by : ARYADVI NEWS

బరువు తగ్గాలంటే బెల్లం మంచిదేనా?

News Image

చక్కెరకు బదులుగా బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి బెల్లం ప్రత్యేకంగా ఉపయోగపడుతుందా అంటే.. నిపుణుల ప్రకారం అలా చెప్పడానికి సరైన ఆధారాలు లేవు.

బెల్లంలో ఐరన్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి కొన్ని ఖనిజాలు చక్కెరతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అయితే క్యాలరీల విషయంలో మాత్రం రెండింటి మధ్య పెద్దగా తేడా లేదు.

100 గ్రాముల బెల్లంలో సుమారు 383 కిలోక్యాలరీలు ఉండగా.. అదే పరిమాణంలో చక్కెరలో దాదాపు 387 కిలోక్యాలరీలు ఉంటాయి. అంతేకాదు, బెల్లంలోనూ సుక్రోజ్‌ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవచ్చు. టీ, కాఫీలో చక్కెర లేదా బెల్లం పరిమాణాన్ని క్రమంగా తగ్గించాలి. స్వీట్లు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్‌ వంటి అదనపు చక్కెర ఉన్న పదార్థాలను తగ్గించి.. వాటి స్థానంలో పండ్లు తీసుకోవడం మంచిది.

ఉదయం లేదా సాయంత్రం ఆకలిగా అనిపించినప్పుడు బిస్కెట్లకు బదులుగా ఒక పండు, కొద్దిగా నట్స్‌ లేదా చక్కెర లేని పెరుగు తీసుకోవచ్చు. భోజనంలో కూరగాయలు, పప్పులు వంటి పోషకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బెల్లం వాడుతున్నా ‘చక్కెరకు బదులు కాబట్టి ఎంతైనా తినొచ్చు’ అనుకోకుండా పరిమితంగా తీసుకోవడం ముఖ్యం.

మొత్తంగా.. బెల్లం చక్కెర కంటే కొన్ని పోషకాలు ఎక్కువగా కలిగి ఉన్నప్పటికీ, అది బరువు తగ్గించే పదార్థం కాదు. బరువు తగ్గడానికి పరిమిత ఆహారం, సమతుల్య భోజనం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ కీలకం

🏠 Home