🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 01 September 2026, 6:15 pm Posted by : ARYADVI NEWS

పులివెందులలో జగన్‌కు ఘనస్వాగతం

News Image

రెండు రోజుల పర్యటనకు పులివెందుల చేరిక

క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్

రేపు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం పులివెందులకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. పులివెందులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు.

రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్న జగన్.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

🏠 Home