🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 01 September 2026, 6:46 pm Posted by : ARYADVI NEWS

దులీప్‌ ట్రోఫీలో షమీ జోరు

News Image

షమీకి 2 వికెట్లు

ముకేశ్‌కు 4 వికెట్లు

సెంట్రల్‌ జోన్‌ 158కే ఆలౌట్‌

దులీప్‌ ట్రోఫీలో మహమ్మద్‌ షమీ తన పేస్‌ బౌలింగ్‌తో సత్తా చాటుతున్నాడు. బెంగళూరులో జరుగుతున్న సెమీఫైనల్‌లో ఈస్ట్‌ జోన్‌ తరఫున బరిలోకి దిగిన షమీ.. సెంట్రల్‌ జోన్‌ను దెబ్బతీశాడు.

సెంట్రల్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో షమీ రెండు కీలక వికెట్లు పడగొట్టగా.. మరో పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ నాలుగు వికెట్లతో చెలరేగాడు. దీంతో సెంట్రల్‌ జోన్‌ 158 పరుగులకే ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 266 పరుగులు చేశాయి. ఈస్ట్‌ జోన్‌ తరఫున వైభవ్‌ సూర్యవంశీ 92 పరుగులతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్‌ 69 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 161 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రెండో ఇన్నింగ్స్‌లో షమీ, ముకేశ్‌ దెబ్బకు సెంట్రల్‌ జోన్‌ కుప్పకూలడంతో ఈస్ట్‌ జోన్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది.

🏠 Home