🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 02 September 2026, 8:41 am Posted by : ARYADVI NEWS

కొండా సురేఖపై అధిష్ఠానం కీలక నిర్ణయం.. రాజీనామా చేయించడానికే మొగ్గు!

News Image

తొలగింపు కంటే రాజీనామాకే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద కీలక చర్చగా మారింది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే బదులు రాజీనామా చేయించే దిశగా అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలపై చర్యలు తీసుకోకపోతే పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని సీఎం అధిష్ఠానానికి నివేదించినట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారశైలితో పాటు మంత్రుల పనితీరుపై కూడా ఆయన నివేదిక అందించినట్లు తెలుస్తోంది.

అధిష్ఠానం పిలుపుతో కొండా సురేఖ ఢిల్లీకి చేరుకోవడంతో ఈ వ్యవహారంపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఆమె భవిష్యత్తుపై భరోసా ఇచ్చి రాజీనామా చేయించేందుకే ఢిల్లీకి పిలిపించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు పూర్తైన తర్వాతే సురేఖ విషయంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సురేఖ అంశంపైనే అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

🏠 Home