🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 07 September 2026, 6:57 pm Posted by : ARYADVI NEWS

ఓలా, ఉబర్ తరహాలో ఆటోలకు ప్రభుత్వ యాప్..!

News Image

ఆటో డ్రైవర్లకు మరింత ప్రయోజనం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సేవలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై పరిశీలన జరుగుతోంది.ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ఐటీ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ఉపయోగపడేలా యాప్‌ను రూపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.మరోవైపు టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ విధానాన్ని తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్చ చేయడం లేదన్నారు.ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. కార్మిక శాఖతో కలిసి ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. దీనిపై కేబినెట్‌లో చర్చించిన అనంతరం శాసనసభలో ప్రతిపాదన తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

🏠 Home