🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 07 September 2026, 11:18 pm Posted by : ARYADVI NEWS

ఏపీలో 913 ఆశా కార్యకర్తల పోస్టులు.. 10వ తరగతి అర్హతతో అవకాశం

News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

ముఖ్య అర్హతలు

విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

వయసు: 25 నుంచి 45 ఏళ్లు

అభ్యర్థులు: సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన స్థానిక మహిళలు

గౌరవ వేతనం: నెలకు రూ.10,000

జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన పనిచేసే జిల్లా ఆరోగ్య సొసైటీల ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. స్థానిక మహిళలకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో 1,294 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. తాజాగా మరో 913 పోస్టులకు ఆమోదం లభించిందని, వీటిని త్వరగా భర్తీ చేసి క్షేత్రస్థాయిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

గమనిక: 913 పోస్టులకు సంబంధించిన అధికారిక జిల్లా వారీ నోటిఫికేషన్, దరఖాస్తు తేదీలు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

🏠 Home