🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 12 September 2026, 6:31 pm Posted by : ARYADVI NEWS

తెలంగాణలో వాన జోరు.. మరో వారం తప్పదట!

News Image

తెలంగాణలో వర్షాల ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరో వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.

🏠 Home