🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 16 September 2026, 6:35 pm Posted by : ARYADVI NEWS

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

News Image

ఖమ్మం, సెప్టెంబర్- 16: త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవిఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, రాజకీయ ప్రతినిధులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ఈవిఎం గోడౌన్ సీల్ ను పరిశీలించి రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీల్ తీసి లోపలికి వెళ్లి, ఈ.వి.ఎం., వి.వి.ప్యాట్లు ఉన్న గది లోపల పరిశీలన చేసి తిరిగి సీల్ వేయించారు. తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. అలారం, ఫైర్ సేఫ్టీ పరికరాలు పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఎన్నికల సామాగ్రి భద్రత అత్యంత ముఖ్యమని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎం.ఏ. రాజు, ఆర్ అండ్ బి డిఇ లఖన్ నాయక్, ఎన్నికల డిటి అన్సారీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పసుమర్తి శ్రీనివాస్, బహుజన్ సమాజ్ పార్టి ప్రతినిధి వేల్పుల రామయ్య, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బి. వేణుగోపాల్, బిజెపి పార్టీ ప్రతినిధి వి. రాజేష్, సిపిఐ (ఎం) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, ఐఎన్ సి పార్టీ ప్రతినిధి అన్నెం గోపాల్ రావు, టిడిపి పార్టీ ప్రతినిధి పాలడుగు టిఆర్ కృష్ణప్రసాద్, అధికారులు, తదితరులు ఉన్నారు.

🏠 Home