🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 30 September 2026, 10:21 pm Posted by : ARYADVI NEWS

విండీస్‌పై టీమ్‌ఇండియా రికార్డు విజయం

News Image

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా కేవలం 43.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 133 బంతుల్లో 223 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కూడా 75 బంతుల్లో 101 పరుగులతో శతకం సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 29 పరుగులు చేశాడు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 405/7 పరుగులు చేసింది. జాన్ క్యాంప్‌బెల్ (101), షై హోప్ (104), అమిర్ జంగో (114) సెంచరీలు చేశారు.406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం వన్డేల్లో భారత్‌కు ఇదే తొలిసారి. గతంలో ఆస్ట్రేలియాపై 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినదే భారత అత్యధిక విజయవంతమైన ఛేజ్‌గా ఉండేది.

🏠 Home