🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 01 October 2026, 9:16 pm Posted by : ARYADVI NEWS

బీసీ రిజర్వేషన్లపై టీడీపీ, వైసీపీ రాజకీయాలు

News Image

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై టీడీపీ, వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. బీసీలను ఓట్ల కోసం మోసం చేస్తున్నాయని ఆరోపించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ఈ తీర్పుపై స్పందించిన విజయసాయి రెడ్డి.. చట్టపరంగా నిలబడవని తెలిసినా 50 శాతం పరిమితిని దాటేలా జీవోలు జారీ చేసి, ఆ తర్వాత కోర్టుల్లో కేసులు వేయడం రెండు పార్టీలకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

🏠 Home