🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 7:16 pm Posted by : ARYADVI NEWS

గాంధీ జయంతి నాడు నిబంధనలు తుంగలోకి.. కోదాడలో యథేచ్ఛగా నాన్-వెజ్ విక్రయాలు

News Image

లహరి హోటల్ కు రూ.4 వేల జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు

Article Photo

కోదాడ, అక్టోబర్ 2 (ఆర్యాద్వి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మాంసాహార విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ కోదాడ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలను బేఖాతరు చేశాయి. గాంధీ జయంతి రోజున చికెన్, మటన్ వంటకాలను యథేచ్ఛగా విక్రయిస్తూ అధికారులకు పట్టుబడ్డారు.

గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లు, హోటళ్లలో నాన్-వెజ్ విక్రయించరాదని మున్సిపల్, పంచాయతీ అధికారులు ముందే ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పట్టణంలోని కొన్ని హోటళ్లు రహస్యంగా మాంసాహారాన్ని వడ్డిస్తున్నారన్న పక్కా సమాచారంతో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా పట్టణంలోని ప్రధాన సెంటర్ లో ఉన్న లహరి హోటల్ లో చికెన్, మటన్ వంటకాలను విక్రయిస్తున్నట్లు అధికారులు ప్రత్యక్షంగా గుర్తించారు. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు గాను హోటల్ యాజమాన్యానికి రూ.4,000 జరిమానా విధించి, రశీదు ఇచ్చారు. అలాగే పట్టణంలోని మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లను కూడా తనిఖీ చేసి హెచ్చరికలు జారీ చేశారు.జాతీయ పండుగలు, ప్రభుత్వం నిషేధించిన రోజుల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

🏠 Home