🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 03 October 2026, 9:12 am Posted by : ARYADVI NEWS

పెద్దలూ.. ఈ వ్యాక్సిన్లు తీసుకున్నారా?

News Image

టీకాలు చిన్నపిల్లలకు మాత్రమే అనుకోవడం సరికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గడంతో పెద్దలకు కూడా కొన్ని వ్యాక్సిన్లు అవసరమవుతాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇన్‌ఫెక్షన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

పెద్దలకూ టీకాలు అవసరం

మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి కొన్ని ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లపై అవగాహన లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ముందస్తుగా తగిన టీకాలు తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంటున్నారు.

ఇవి ముఖ్యమైనవి

పెద్దలకు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి హెపటైటిస్‌-బి, చికెన్‌పాక్స్, టిడాప్‌ వంటి వ్యాక్సిన్లు అవసరం కావచ్చు. గతంలో టీకాలు తీసుకోని వారు, ఆరోగ్య రంగంలో పనిచేసేవారు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా టీకాల అవసరాన్ని వైద్యులు పరిశీలిస్తారు.

గర్భిణులకు టిడాప్‌ టీకా ఇవ్వడం ద్వారా తల్లితో పాటు పుట్టబోయే శిశువుకు కూడా రక్షణ లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. జంతువులు కరిచిన సందర్భంలో యాంటీ-రేబిస్‌ టీకా తీసుకోవడం అత్యవసరం.

వైద్యుల సలహా తప్పనిసరి

అందరికీ ఒకే రకమైన టీకాలు అవసరం ఉండవు. వయసు, ఆరోగ్య పరిస్థితి, గతంలో తీసుకున్న టీకాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యుల సలహాతో అవసరమైన వ్యాక్సిన్లను నిర్ణయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

🏠 Home