🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 6:45 pm Posted by : ARYADVI NEWS

కోదాడలో రోడ్డు ఎవరిది..? మాల్‌ది ఎలా అయింది?

News Image

నిబంధనలు సామాన్యులకేనా..? అధికారుల మౌనం ఎందుకు?

కోదాడ, అక్టోబర్ 04 (ఆర్యాద్వి): అభివృద్ధి పేరుతో పెద్ద షాపింగ్ మాల్‌లు రావడం స్వాగతించాల్సిన విషయమే. కానీ ప్రజలు నిత్యం వినియోగించే రహదారులపై ఏర్పాట్లు చేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం ప్రశ్నించాల్సిందే. కోదాడలోని చెన్నై షాపింగ్ మాల్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన రహదారిపై బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేయడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే రహదారిపై ఇలాంటి ఏర్పాట్లకు ఎవరి అనుమతి ఉంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రోడ్డు హద్దులు ఎక్కడ?

మాల్‌కు సంబంధించిన పార్కింగ్, ప్రవేశ మార్గాలు, ఇతర ఏర్పాట్ల కోసం ఎంత స్థలం వినియోగిస్తున్నారు? ప్రజా రహదారి హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయి? మున్సిపల్ అధికారులు దీనిపై సర్వే నిర్వహించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

నిబంధనలు సామాన్యులకేనా?

Article Photo

చిన్న వ్యాపారులు రోడ్డు మీద కొంత స్థలం వినియోగించినా, ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసినా అధికారులు చర్యలు తీసుకుంటారు. మరి పెద్ద వాణిజ్య సంస్థల విషయంలో కూడా అదే నిబంధనలు వర్తిస్తాయా? అనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

అధికారులు స్పందించాల్సిందే

మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ఆక్రమణ జరిగిందా? అనుమతులు ఉన్నాయా? తాత్కాలిక ఏర్పాట్లకు నిబంధనలు ఏమిటి? అనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలి

వ్యాపారం అభివృద్ధి చెందాలి... కానీ ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకూడదు.

రోడ్డు ప్రజలది... నిబంధనలు అందరికీ ఒకటేనా?

కోదాడ ప్రజల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడిస్తారా? లేక ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయా? వేచి చూడాలి.

🏠 Home