🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 11:18 pm Posted by : ARYADVI NEWS

సాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలు

News Image

•పంటలను కాపాడేందుకు చివరి తడికి నీటి విడుదల •మంత్రి తుమ్మల వెల్లడి

•లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములకు విద్యుత్‌ సరఫరా

•రైతులు ఆందోళన చెందొద్దు.. •నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక చర్యలు

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్: 5:తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడేందుకు చివరి తడికి నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సాగర్‌ ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని చెప్పారు. పంటలు ఎండిపోకుండా అవసరమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సాగర్‌ ఆయకట్టుతోపాటు అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు కూడా అదనంగా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఆయకట్టు, ప్రాజెక్టులకు నీరు..

పినపాక నియోజకవర్గంలోని తుమ్మల చెరువు ఆయకట్టుకు, అలాగే వైరా ప్రాజెక్టు, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు, సింగభూపాలెం ప్రాజెక్టు, లంకాసాగర్‌ ప్రాజెక్టులకు కూడా గోదావరి జలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా ప్రాజెక్టులు, చెరువుల పరిధిలోని ఆయకట్టుకు నీరు అందించి సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

లిఫ్ట్‌లకు విద్యుత్‌ సరఫరా..

పంటలను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను వినియోగించుకుంటున్నామని తుమ్మల తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములకు కూడా విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. లిఫ్ట్‌ల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పొలాలకు అందించి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సీఎం ఆదేశాలతో ప్రత్యేక చర్యలు..

తీవ్ర వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యతలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు చేసిన పంటలను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నీటిని వృథా చేయొద్దు...

ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదావరి జలాలను రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని తుమ్మల సూచించారు. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే మరింత విస్తీర్ణంలోని పంటలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వేసిన పంటలకు చివరి తడి అందించడమే లక్ష్యంగా నీటి విడుదల చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. సాగర్‌ ఆయకట్టుతోపాటు పినపాక నియోజకవర్గంలోని తుమ్మల చెరువు ఆయకట్టు, వైరా, వెంగలరాయ సాగర్‌, సింగభూపాలెం, లంకాసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు నీటి విడుదలతోపాటు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు విద్యుత్‌ సరఫరా చేసి అన్ని విధాలుగా సహకరిస్తామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

🏠 Home