🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 10:03 am Posted by : ARYADVI NEWS

వాయిల సింగవరంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

News Image

ముదిరాజ్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ.. భారీగా హాజరైన భక్తులు

Article Photo

అనంతగిరి, అక్టోబర్ 17 (ఆర్యాద్వి):మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో ముదిరాజ్ కాలనీ యువత ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా ముదిరాజ్ కాలనీ యూత్ సభ్యులు ఐక్యంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది.గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యువకులు స్వయంగా వడ్డిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు యువతలో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని గ్రామ పెద్దలు కొనియాడారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముదిరాజ్ కాలనీ యూత్ సభ్యులను గ్రామ సర్పంచ్ తో పాటు పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ కంటూ రమాదేవి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు, గద్దె రఘు, గద్దె రామారావు, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కంటూ నాగార్జున, కంటూ వేణు, చుండూరి మురళి, కంటూ శ్రీకాంత్, కొల్లు సుబ్బారావు. గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🏠 Home