🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 7:03 pm Posted by : ARYADVI NEWS

ఆ దుర్గా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

News Image

దేవీ నవరాత్రుల్లో భాగంగా మహా అన్నదానం

అనంతగిరి, అక్టోబర్ 18 (ఆర్యాద్వి):

Article Photo

మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో ఆదివారం రోజు అమ్మవారి సన్నిధిలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నవరాత్రుల్లో భాగంగా 8 వ రోజు అమ్మవారు శ్రీ దుర్గా దేవి అవతారంలో అలంకరించి జంగిలి సతీష్ఉమా దంపతుల చే ప్రత్యేక పూజలు పూజారి సూర్యనారాయణ శర్మ నిర్వహించారు.అనంతరం యువశక్తి యుత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి పలువురు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే యువశక్తి ఉత్సవ కమిటీ దేవీ నవరాత్రుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శించుకుని కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అకాంక్షించారు.ఈ కార్యక్రమంలో

గ్రామ సర్పంచ్ నందిగామశ్రీనివాసులు

అనంతగిరి మండలం మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ వెంపటి వెంకటేశ్వరరావు, గుండ్లపల్లి వెంకన్న, వీరబోయిన నాగరాజు, కంటూ నాగేశ్వరరావు,బుర్ర నరేష్, బుర్ర పెద్ద గొల్ల వెంకన్న. బుర్ర పెద్ద గొల్ల సైదులు గడ్డం వీరబాబు, వీరబోయిన రాములు, బుర్ర వీరబాబు, దేవులపల్లి నరసింహారావు,గద్దె రఘు,గద్దె రామారావు బుర్ర పవన్ గ్రామ ప్రజలు యువత మహిళలు చిన్నారులు దుర్గ మాల ధరించిన భక్తులు అయ్యప్ప భక్తులు యువ శక్తి యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

🏠 Home