🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 19 October 2026, 9:48 am Posted by : ARYADVI NEWS

సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం యువ కాంగ్రెస్ ప్రచారం.. కొత్తగూడెంలో హోరెత్తిన నినాదాలు

News Image

కొత్తగూడెంలో సర్వోత్తం రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారం ప్రారంభం

అక్టోబర్ 18, అనంతగిరి(ఆర్యాద్వి): ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఓట్ల ప్రచారం, పట్టభద్రుల ఓటరు నమోదు కార్యమాన్ని ఆదివారం అనంతగిరి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాగి నరేష్ అధ్యక్షత వహించారు.

రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డి, అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకులు డైనమిక్ రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డిని ఎమ్మెల్సీ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు.

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6 వరకు ఫారం–18 ద్వారా ఓటరు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం గడువు విధించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ.. “పట్టభద్రుల ఓటు హక్కు నమోదు కోసం ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలి అని. సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం యువత, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల సీనియర్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటేపులి వెంకటేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ అజీమ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి నెల్లూరి వినయ్, గొండ్రియాల గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టిముక్కుల బాబురావు, కొత్తగూడెం సర్పంచి వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home