ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. కరవును ఎదుర్కొనేందుకు ప్రత్యేక కమిటీ!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు, కరవు ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టేందుకు ఆరుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
భట్టి విక్రమార్కకు కీలక బాధ్యతలు
ఈ కమిటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నారు. కరవు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, నీటి లభ్యతను పరిశీలించడం, అవసరమైన ముందస్తు చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేయడం కమిటీ ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి.
ముందస్తు చర్యలపై దృష్టి
వర్షపాతం తగ్గడం, ఎల్‌నినో ప్రభావం వంటి పరిణామాలు వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులకు అనుగుణంగా వివిధ శాఖలు చేపట్టాల్సిన చర్యలను కమిటీ పరిశీలించనుంది. కరవు తీవ్రత పెరగకుండా అవసరమైన ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది.