🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 20 October 2026, 8:59 am Posted by : ARYADVI NEWS

ప్రజాదివాస్‌లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్

News Image

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 19:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలు, భార్యభర్తల సమస్యలపై వచ్చిన పలువురు బాధితులు తమ ఫిర్యాదులను పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.

ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక వివాదాలు, భూ తగాదాల విషయంలో ఫిర్యాదుల స్వభావాన్ని బట్టి చట్టప్రకారం స్పందించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.

ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకతతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

🏠 Home