మీట్యా తండ–వసంతాపురం తండ రహదారికి రూ.1.80 కోట్ల నిధులు
నిధుల మంజూరుపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ భూక్య శైలజ నాగరాజు
అనంతగిరి, అక్టోబర్ 21(ఆర్యాద్వి):
మీట్యా తండ నుంచి వసంతాపురం తండ మీదుగా నిర్మించనున్న రహదారికి రూ.1.80 కోట్ల నిధులు మంజూరు కావడంపై వసంతాపురం గ్రామ సర్పంచ్ భూక్య శైలజ నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతు వెంకటయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వారు మాట్లాడుతూ.. మీట్యా తండ నుంచి వసంతాపురం తండ మీదుగా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కావడం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణంతో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు, రైతులు,వాహనదారులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు కీలకమని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు పేర్కొన్నారు. రహదారి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆకాంక్షించారు