🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 9:07 am Posted by : ARYADVI NEWS

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

News Image

అనంతగిరి, అక్టోబర్ 21 (ఆర్యాద్వి): అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కాసాని నాగయ్య సతీమణి బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ గాదె వెంకన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పేద వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. గ్రామంలోని పేద కుటుంబాలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో కార్యకర్తలకు, పేదలకు తోడుగా నిలవడమే తన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనగాల వీరయ్య, నాయకులు జెర్రిపోతుల నాగేశ్వరరావు, కాసాని వెంకటేష్ పాల్గొన్నారు.

🏠 Home