🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 9:13 am Posted by : ARYADVI NEWS

మాటిస్తే మడమతిప్పడు.

News Image

- ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రజానాయకుడు "మాలోత్ నెహ్రూ నాయక్"

మహబూబాబాద్: అక్టోబర్, 21:

మానవత్వమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ!

కురవి మండలం గాజా తండా గ్రామపంచాయతీ పరిధిలోని టేకులతండాకు చెందిన గూగులోత్ నరేష్ భార్య కళ్యాణి కుటుంబ కలహాల నేపథ్యంలో గత రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమైన విషయం. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఆ పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ ముందుకు వచ్చారు.

ఆ సమయంలో ఆ ఇద్దరు చిన్నారుల పేరుపై చెరో ₹50,000 చొప్పున మొత్తం ₹1,00,000 డిపాజిట్ చేస్తానని ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం టేకులతండాలోని వారి ఇంటికి స్వయంగా వెళ్లి, ఇద్దరు చిన్నారుల కోసం మొత్తం లక్ష రూపాయలను అందజేశారు.

మాటలు చెప్పడం కాదు.. ఇచ్చిన మాటను చేతల్లో చూపించడమే నిజమైన నాయకుడి లక్షణం అని మాలోత్ నెహ్రూ నాయక్ మరోసారి నిరూపించారు.

తల్లిని కోల్పోయి బాధలో ఉన్న చిన్నారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వారి భవిష్యత్తుకు తన వంతు సహాయం అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వానికి పెద్దపీట వేస్తూ, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే ఆయన ఆలోచన అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, అవసరమైన సమయంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చే ఇలాంటి నాయకులు సమాజానికి ఎంతో అవసరమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకొని చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించిన మాలోత్ నెహ్రూ నాయక్ టేకులతండా గ్రామస్థులు ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల నమ్మకమే ఆయన బలం..

మానవత్వమే ఆయన మార్గం..

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఆయన నైజం!

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోతు శివలాల్, ఉప సర్పంచ్ హాసిలి వీరన్న, గ్రామ అధ్యక్షులు వాసు నాయక్, వార్డు సభ్యులు నవీన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిషన్, విజయ్, వెంకన్న, శంకర్, సూర్య, వీరన్న, నరీయ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home