🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 9:15 am Posted by : ARYADVI NEWS

ఎంపీ వద్దిరాజు ఖమ్మంలో 22వతేదీన వామపక్షాలతో కలిసి తలపెట్టిన ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలి రావలసిందిగా బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు

News Image

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 21:

నిరుపేదలకు ఇండ్లు కేటాయించే విషయంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఇందుకు నిరసనగా వామపక్షాలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఈనెల 22వతేదీ గురువారం ఉదయం తలపెట్టిన ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన సన్నాహాక సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,జేడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితర నాయకులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టేందుకు వామపక్షాలు కలిసి రావడం అభినందనీయమన్నారు.ఇండ్ల మంజూరు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 రద్దు గురించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో మాట్లాడి న్యాయపోరాటం చేస్తామన్నారు.ఈ జీవో ద్వారా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ,వాటిని మొత్తంగా కాంగ్రెస్ నాయకులతో నింపారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లోకి వలస పోకుండా ఉండేందుకే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తున్నదన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో డబుల్ బెడ్ రూం ఇండ్లను గొప్పగా నిర్మించి రాజకీయాలకు అతీతంగా లాటరీ పద్ధతిలో కేటాయించి అర్హులైన ఏ ఒక్కరి కూడా అన్యాయం జరుగకుండా చేశారని ఎంపీ వద్దిరాజు వివరించారు.ఇప్పటి పాలకులు లాటరీ పద్ధతికి స్వస్తి పలికి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అసలైన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా విఫలం కావడంతో దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్ బాటపట్టేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను పాలకులు పోలీసుల చేత బెదిరిస్తున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఈవిధంగా రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతున్నదని, జిల్లాలోని పేదలకు మేలు చేయడంలో ముగ్గురు మంత్రులు పూర్తిగా విఫలం చెందారని ఆయన విమర్శించారు.ఇండ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగకుండా, కాంగ్రెస్ వారితో నింపిన ఇందిరమ్మ కమిటీల రద్దు కోసం ఖమ్మం కలెక్టరేట్ వద్ద గురువారం ఉదయం (రేపు, 22వతేదీ)నిర్వహించే ధర్నాకు గులాబీ జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో తరలి రావలసిందిగా ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు పగడాల నాగరాజు, బెల్లం వేణు,ఖమర్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home