🏠 www.aryadvi.com
Watermark Width: 75%
Watermark Height: 75%
Opacity:
Header Banner Height: 110px
Watermark
Clip Header Logo
Date of Publish : 23 October 2026, 9:19 am Posted by : ARYADVI NEWS

కోదాడలో ఘనంగా అమిత్ షా జన్మదిన వేడుకలు

News Image

కోదాడ అక్టోబర్ 22 (ఆర్యాద్వి):

సూర్యాపేట జిల్లా, కోదాడ: పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో బీజేపీ యువ నాయకుడు ఏపూరి సత్యరాజు మాదిగ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ప్రవాస్ కన్వీనర్ జల్లా జనార్ధన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమిత్ షా దేశ ఐక్యత, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధిలో, దేశ రాజకీయాల్లో అమిత్ షా అందిస్తున్న సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోదుమూరు ప్రవీణ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కట్ట కోజు నాగేంద్ర చారి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి పిడతల శంకర్, బీజేపీ సీనియర్ నాయకులు మొనగాల శీను, కోదాడ పట్టణ ప్రధాన కార్యదర్శి పైడిమరి సతీష్, కోశాధికారి యాదా కిరణ్, జనసేన కోదాడ నియోజకవర్గ నాయకుడు పసుపులేటి రామారావు, బీజేపీ నాయకులు బడావత్ రమేష్ నాయక్, ఉపేందర్ చారి, కనకాచారి, సంపేట భాగ్యరాజు, కందిబండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home