ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై బిఆర్ఎస్,వామపక్షాల గర్జన..
ముట్టడితో దద్దరిల్లిన ఖమ్మం కలెక్టరేట్
ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి
లాటరీ పద్ధతిలో
బిఆర్ఎస్, వామపక్షాల డిమాండ్..
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 22:
చట్ట బద్దత లేని ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి : నున్నా
* ఈ సందర్భంగా

సిపిఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజాపాలన పేరుతో లబ్ధిదారులను ఎంపిక చేసినా, ఇందిరమ్మ కమిటీలను రాజకీయాలకు అతీతంగా వేస్తామని చెప్పి ఏ గ్రామంలోనూ కాంగ్రెస్ వారు కాకుండా ఇంకెవరికీ చోటు ఇవ్వలేదని మండిపడ్డారు.
ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగించేలా పోరాటం : సండ్ర
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ కమిటీల రద్దు, న్యాయమైన లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగించేలా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇళ్లు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఈ రకమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా రాజ్యాంగం పుస్తకం చేతపట్టుకుని తిరిగే కాంగ్రెస్ నాయకులకు, రాహుల్ గాంధీకి తెలంగాణలోని నిరుపేదల రాజ్యాంగ హక్కులు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కఠినమైన నిబంధనలు అమలు చేసి పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం విఫలం
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 వాగ్దానాలలో అన్ని వాగ్దానాలు విఫలమయ్యాయని,, ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా విఫలమైందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి, నేడు అధికారంలోకి వచ్చాక చేసిన పాలనలో కూడా నైతికత లేదని, ఆయన ప్రభుత్వం కూడా నూటికి నూరు శాతం విఫలమై ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం లో సీపీఎం నాయకులు యర్రా శ్రీనివాసరావు,బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, బొంతు రాంబాబు తో పాటు ఇతర వామ పక్ష పార్టీల నేతలు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కు వినతిపత్రం
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ను అఖిల పక్ష నాయకులు కలిసి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు, రాజకీయ వివక్ష ను వివరించి, వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండి రమేష్, యర్రా శ్రీనివాసరావు, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు,మాజీ ఎమ్మెల్యే లు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి తో పాటు సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి సీ వై పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.