అనంతగిరి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్.. విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన
అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న విద్యార్థులు
అనంతగిరి, అక్టోబర్ 24 (ఆర్యాద్వి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అనంతగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర, శాంతిభద్రతల పరిరక్షణలో అందిస్తున్న సేవల గురించి వివరంగా అవగాహన కల్పించారు.

పోలీస్ శాఖలో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ పరికరాలు, నేర పరిశోధనకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పోలీసింగ్ విధానాల గురించి విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు.
ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు, ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేశారు.
విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. పోలీస్-ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమేనని అన్నారు.