తెలంగాణ శబరిమలలో 18వ రోజు అన్నప్రసాద వితరణ ఘనంగా...
530 మంది స్వాములకు అన్నప్రసాదం - దాతలుగా అలవాల సైదులు దంపతులు
అనంతగిరి, అక్టోబర్ 24 (ఆర్యాద్వి): మండల కేంద్రంలోని తెలంగాణ శబరిమలగా పేరొందిన అనంతగిరి శ్రీ అయ్యప్ప సన్నిధిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం శనివారం 18వ రోజు ఘనంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో సుమారు 530 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ రోజు అన్నప్రసాద వితరణకు ఖానాపురానికి చెందిన అలవాల సైదులు దంపతులు దాతలుగా వ్యవహరించారు.
ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు మాట్లాడుతూ దాతలు భక్తులకు అన్నప్రసాదం అందించడం జరిగిందని తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు అన్నప్రసాద దాతలు గా ఉండవచ్చని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పందిరి వీరయ్య, అల్లెబోయిన కోటయ్య, పి. నరసింహారావు, గరిడేపల్లి ఉపేందర్, మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.