పీడీఎస్ బియాన్ని బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిపై పీడీ యాక్ట్ : పోలీస్ కమిషనర్

ఖమ్మం ప్రతినిధి : ఆగస్టు, 24 :పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అంతర్రాష్ట్రాలకు తరలించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ ఆర్థిక లాభాలు ఆర్జిస్తున్న మీర్జా జిలానీ బేగ్ (48) సం,,పై పీడీ యాక్ట్‌ను అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మీర్జా జిలానీ బేగ్ (48) సం,, రేషన్ డీలర్లు, వారి ఏజెంట్ల ద్వారా కార్డుదారులకు అందాల్సిన సబ్సిడీ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై తల్లాడ పోలీస్ స్టేషన్లలో పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలుసంబంధించి మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసుల్లో భారతీయ న్యాయ...