తెలంగాణలో రేపు పాలిటెక్నిక్ కాలేజీల బంద్
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 97పై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రేపు (మంగళవారం) రాష్ట్రవ్యాప్త పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది.పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాల్సింది పోయి, ఈ నిర్ణయం ద్వారా వాటిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించింది.ఈ నూతన విధానం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్లో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన...