కొండా సురేఖపై అధిష్ఠానం కీలక నిర్ణయం.. రాజీనామా చేయించడానికే మొగ్గు!
తొలగింపు కంటే రాజీనామాకే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద కీలక చర్చగా మారింది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే బదులు రాజీనామా చేయించే దిశగా అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలపై చర్యలు తీసుకోకపోతే పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని సీఎం అధిష్ఠానానికి నివేదించినట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారశైలితో పాటు మంత్రుల పనితీరుపై కూడా ఆయన నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం పిలుపుతో కొండా సురేఖ ఢిల్లీకి...