మద్రాస్ హైకోర్టులో స్టాలిన్‌కు ఎదురుదెబ్బ

తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తన కొలత్తూర్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ 100 శాతం వీవీపాట్ స్లిప్పులను రీకౌంట్ చేసి తనను విజేతగా ప్రకటించాలని స్టాలిన్ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఎన్నికల ఫలితాలను సాధారణ రిట్ పిటిషన్ ద్వారా సవాలు చేయలేరని, ఎన్నికల పిటిషన్‌ ద్వారానే సవాలు చేయాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం.. స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణార్హం కాదంటూ కొట్టివేసింది.