వాయిల సింగవరంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

ముదిరాజ్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహణ.. భారీగా హాజరైన భక్తులు అనంతగిరి, అక్టోబర్ 17 (ఆర్యాద్వి):మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో ముదిరాజ్ కాలనీ యువత ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా ముదిరాజ్ కాలనీ యూత్ సభ్యులు ఐక్యంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది.గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున...