SIR పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల్లో అసలు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఖమ్మం అక్టోబర్-17: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్‌ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు/జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు....