కరువు మండలాల జాబితాలో ఏన్కూర్, కొణిజర్ల, వైరా మండలాలను చేర్చాలి
వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి కారేపల్లి, కామేపల్లి మండలాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించాలి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ పక్షపాతాన్ని విడనాడాలి వైరా, అక్టోబర్ 17, జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ఏన్కూరు, కొణిజర్ల, వైరా మండలాలను చేర్చాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి, రైతులు, పేదల సమస్యలను పరిష్కరించాలని కోరారు. శనివారం వైరాలోని సీపీఐ(ఎం) డివిజన్ కార్యాలయం బోడేపూడి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూక్యా వీరభద్రం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్,...