సర్పంచ్ ఇంటి ముందే బురద రోడ్డు.. అమలుకు నోచుకోని అభివృద్ధి!

అధికారుల కళ్లకు కనిపించడం లేదా? అమీనాబాద్‌లో అధ్వానంగా రహదారి! ఇదేనా అభివృద్ధి? బురదలో కూరుకుపోతున్న అమీనాబాద్! అమీనాబాద్‌లో రహదారి దుస్థితి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు అనంతగిరి అక్టోబర్ 18 (ఆర్యాద్వి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో రహదారి దుస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామంలో స్థానిక సర్పంచ్ ఇంటి ముందున్న ప్రధాన రహదారే బురదమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అడుగడుగునా గుంతలు, బురద పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు. పాదచారులు నడవలేని పరిస్థితి నెలకొంది. సర్పంచ్ ఇంటి ముందే రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, గ్రామంలోని ఇతర...