ఆ దుర్గా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

దేవీ నవరాత్రుల్లో భాగంగా మహా అన్నదానం అనంతగిరి, అక్టోబర్ 18 (ఆర్యాద్వి): మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో ఆదివారం రోజు అమ్మవారి సన్నిధిలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నవరాత్రుల్లో భాగంగా 8 వ రోజు అమ్మవారు శ్రీ దుర్గా దేవి అవతారంలో అలంకరించి జంగిలి సతీష్ఉమా దంపతుల చే ప్రత్యేక పూజలు పూజారి సూర్యనారాయణ శర్మ నిర్వహించారు.అనంతరం యువశక్తి యుత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి పలువురు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే యువశక్తి ఉత్సవ కమిటీ దేవీ నవరాత్రుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో...