నాచారం రహదారికి రూ.44 కోట్లతో మహర్దశ

నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ రఘురాం రెడ్డి ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 18: ఏన్కూరు: రూ. 44 కోట్లతో నిర్మించే నాచారం రహదారి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన...