"ఎర్రబోడులో" సద్దుల బతుకమ్మ సంబరాలు..

కారేపల్లి అక్టోబర్ 18: కారేపల్లి మండలం ఎర్రబోడులో 9వ రోజు ఘనంగా నిర్వహించారు సద్దుల ముద్దుల బతుకమ్మ వేడుకలను చూడ ముచ్చటగా జరుపుకున్నారు . మహిళలు , చిన్నారులు భక్తిశ్రద్ధలతో తెలంగాణ సాంప్రదాయాలతో ఉత్సాహంగా నిర్వహించారు . చప్పట్లు కోలాటాలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సందడిగా జరుపుకున్నారు అనంతరం ప్రసాద వితరణ , బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి . ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువతి యువకులు గ్రామ పెద్దలు పాల్గొని బతుకమ్మ వేడుకను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో కారేపల్లి సొసైటీ మాజీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు ఎర్రబోడు సిపిఎం కార్యదర్శి కురసం శ్రీను, వజ్జ రామారావు కడియాల రాజు అడప...