పాలవరం తండాలో రోడ్ల పక్కన పిచ్చి మొక్కల తొలగింపు
అనంతగిరి, అక్టోబర్ 18 (ఆర్యాద్వి): మండల పరిధిలోని పాలవరం తండా గ్రామపంచాయతీ పరిధిలో రహదారులకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు, ముళ్ల పొదల తొలగింపు పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ భూక్యా నారాయణ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. రోడ్లపై రాకపోకలకు అడ్డంకిగా ఉన్న పిచ్చి మొక్కల వల్ల వాహనదారులకు, పాదచారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించి ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా నారాయణ మాట్లాడుతూ "రోడ్లకు ఇరువైపులా పిచ్చి చెట్లు, కంపలు ఏపుగా పెరిగి రహదారిని కప్పేస్తున్నాయి. దీంతో రాత్రి వేళల్లో వాహనదారులకు దృష్టి అంతరాయం కలుగుతోంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ...