మద్యం దుకాణాల్లో సిండికేట్ దందా..

*క్వార్టర్ బాటిల్‌ పై అదనపు వసూళ్లతో సామాన్యుల దోపిడీ! * లైసెన్స్ షాపులలోనే ప్రతి బాటిల్ పై 10/ అదనపు వసూళ్ళు... సరుబుజ్జిలి న్యూస్ అక్టోబర్ 19 నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, కొన్ని సరుబుజ్జిలి మండలంలో ప్రాంతాల్లో దుకాణదారుల అక్రమాలు, సిండికేట్ పద్ధతులు సామాన్య వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. మండం లో వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల యాజమాన్యం కుమ్మక్కై (సిండికేట్ అయి), ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి 180 ఎమ్ఎల్ (క్వార్టర్) బాటిల్‌పై 10 నుండి అంతకంటే ఎక్కువగా అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిండికేట్ రూపంలో సామాన్యులపై ఒత్తిడి కొనుగోలుదారులు ఎమ్మార్పీ ధరల గురించి...