ప్రజాదివాస్‌లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 19: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీలు, భార్యభర్తల సమస్యలపై వచ్చిన పలువురు బాధితులు తమ ఫిర్యాదులను పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ...