ఇద్దరికి చూపునివ్వనున్న వెంకటేష్–రమ్య దంపతులు!
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి.. కుటుంబ సభ్యుల నిర్ణయంపై అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రశంసలు.. సింగరేణి: అక్టోబర్: 19, ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన మధ్యబోయిన వెంకటేష్–రమ్య దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ విషాద సమయంలోనూ వారి కుటుంబ సభ్యులు దంపతుల నేత్రాలను దానం చేసేందుకు ముందుకు రావడం అందరి హృదయాలను కదిలించింది. వారి నేత్రదానం ద్వారా మరో ఇద్దరికి చూపు లభించే అవకాశం కలగడం అభినందనీయమని పలువురు కొనియాడారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో దంపతుల మృతదేహాలను అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల...