అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం_

ఆర్థిక ఇబ్బందులెదురైనా సంక్షేమ పథకాల అమలు ఆగదు ?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరంతరాయంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 19: తెలంగాణలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని, చివరి అర్హుడైన లబ్ధిదారుడికి కూడా న్యాయం జరిగే వరకు ఈ ప్రక్రియ...