సూర్యాపేట సూపర్ మార్కెట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఆస్తి నష్టం

సూర్యాపేట: దసరా పండుగ వేళ సూర్యాపేట పట్టణంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన కలకలం రేపింది. పట్టణంలోని పీఎస్సార్ సెంటర్‌లో ఉన్న శ్రీసాయి సూపర్ మార్కెట్‌లో సోమవారం గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్ పేలినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో సూపర్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతినగా, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సిలిండర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి సూపర్ మార్కెట్‌లోని వస్తువులు, ఇతర సామగ్రి దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు,...