మీట్యా తండ–వసంతాపురం తండ రహదారికి రూ.1.80 కోట్ల నిధులు

నిధుల మంజూరుపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ భూక్య శైలజ నాగరాజు అనంతగిరి, అక్టోబర్ 21(ఆర్యాద్వి): మీట్యా తండ నుంచి వసంతాపురం తండ మీదుగా నిర్మించనున్న రహదారికి రూ.1.80 కోట్ల నిధులు మంజూరు కావడంపై వసంతాపురం గ్రామ సర్పంచ్ భూక్య శైలజ నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతు వెంకటయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వారు మాట్లాడుతూ.. మీట్యా తండ నుంచి వసంతాపురం తండ మీదుగా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కావడం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ రహదారి...