కోదాడలో ఘనంగా కనకదుర్గ అమ్మవారి శోభాయాత్ర...
కోదాడ, అక్టోబర్ 21( ఆర్యాద్వి): కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ డ్రైవర్ కాలనీలో కనకదుర్గ అమ్మవారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏఎన్ఆర్ టాక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి శోభాయాత్రను భారీ ఎత్తున నిర్వహించగా, కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేళతాళాలు, ఉత్సాహభరితమైన నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ అమ్మవారి శోభాయాత్ర వైభవంగా సాగింది. కాలనీలోని ప్రధాన వీధుల గుండా సాగిన యాత్రను తిలకించేందుకు...