అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం: జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్
ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 21: ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్, జిల్లా పోలీస్ యంత్రాంగం, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు....