ఆకుల వెంకటేశ్వర్లుకు నివాళులర్పించిన సిపిఎం రాష్ట్ర సీనియర్ నేత పి. సోమయ్య..

ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 21: ఖమ్మం :దంసలాపురము మాజీ సర్పంచ్ ఆకుల వెంకటేశ్వర్లు అకాలమరణం పట్ల సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు పి సోమయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టి రంగారావు, ట్రస్ట్ బోర్డర్ కార్యదర్శి కనిశెట్టి నర్సయ్య, నగర కార్యదర్శి బైరిశెట్టి శ్రీనివాసరావు , గుండపనేని నాగేశ్వరరావు, బండారు రామ కృష్ణ, సిపిఎం నాయకులు కే నరసయ్య,శ్రద్ధాంజలి ఘటీంచారు . వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని నివాళులు అర్పించారు. అనంతరం వారి కుమారుడు సుందరయ్య, వారి తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.